'నది హారతి' ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే
TPT: శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నదిలో నేడు 'నది హారతి' కార్యక్రమం జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను బుధవారం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఆలయ ఛైర్మన్ సాయి ప్రసాద్‌తో కలిసి పరిశీలించారు. అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.