హోళీ సంబరాల్లో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే
నిజామాబాద్ బీజేపీ జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన హోళీ వేడుకల్లో అర్బన్ నియోజకవర్గ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. కార్యకర్తలు, నాయకులతో కలిసి రంగులు చల్లుకున్నారు. నియోజకవర్గ ప్రజలతో పాటు జిల్లా ప్రజలకు ఆయన హోళీ శుభాకాంక్షలు తెలియజేశారు.