విద్యుత్ వైర్ తెగి పడి బైకు దగ్ధం
AKP : నాతవరం మండలం గన్నవరం మెట్ట వద్ద అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో బైక్ దగ్ధమైంది. భీమవరపుకోటకు చెందిన దాడి రామ సత్యనారాయణ అనే వ్యక్తి ఫ్యాషన్ ప్రో వాహనాన్ని రోడ్డు పక్కన పార్కు చేసి ఉంచాడు. అదే సమయంలో పైన ఉన్న విద్యుత్ వైరు తెగి బైక్ మీద పడడంతో అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు.