యుద్ధం ఎఫెక్ట్.. బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు
VKB: జిల్లాలో పశ్చిమాసియా యుద్ధం కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతోపాటు కొరత ఏర్పడుతుందన్న సమాచారంలో వాహనాదారులు ఒక్కసారిగా బంకుల వద్ద బారులు దీరారు. వికారాబాద్ పట్టణంలోని 11 బంకుల్లో వాహనాలు కిక్కిరిసిపోయి రెండు గంటల వ్యవధిలోనే పెట్రోల్, డీజిల్ ఖాళీ అయ్యాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా బంకుల్లో డీజిల్, పెట్రోల్ నిండుకోవడంతో 'నో స్టాక్' బోర్డు వెలిశాయి.