జిల్లాలో అగ్ని ప్రమాదం.. ఎగసి పడుతున్న మంటలు

జిల్లాలో అగ్ని ప్రమాదం.. ఎగసి పడుతున్న మంటలు

తూ.గో: పంగిడి రిలయన్స్ బయోగ్యాస్ ఉత్పత్తి కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ధాటికి మంటలు భారీగా ఎగసి పడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా, ఘటనకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.