ప్రమాద రహితంగా గణేష్ ఉత్సవాలు నిర్వహిద్దాం: ఎస్పీ

సత్యసాయి: హిందూపురంలోని పరిగి రోడ్డులో గల కామాక్షి కళ్యాణ మండపంలో గణేష్ మండపాల నిర్వాహకులతో ఎస్పీ రత్న మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఈ ఏడాది గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రమాద రహితంగా నిర్వహించుకోవాలని తెలిపారు. ప్రజలకు, ఇబ్బందులు కలిగించకుండా ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పోలీసు నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు.