మాజీ ప్రధానికి బెదిరింపులు.. యువకుడికి శిక్ష

మాజీ ప్రధానికి బెదిరింపులు.. యువకుడికి శిక్ష

బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ పై జాత్యాహంకార బెదిరింపులకు పాల్పడిన ఓ 21 ఏళ్ల యువకుడికి స్థానిక కోర్టు జైలుశిక్ష విధించింది. బర్కన్‌హెడ్‌కు చెందిన లియామ్ షా గతేడాది జూన్‌లో సునాక్ జాత్యాహంకార హత్యా బెదిరింపులతో కూడిన రెండు EMAILలు పంపాడు. ఈ అంశంపై విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే కోర్టు అతడికి 14 వారాల జైలుశిక్ష విధించింది.