పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని మహిళల నిరసన

పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని మహిళల నిరసన

PDPL :పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. మంగళవారం గోదావరిఖనిలో ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సంఘం రాష్ట్ర నాయకురాలు కోడిపుంజుల లక్ష్మి మాట్లాడుతూ.. యుద్ధం సాకుతో కేంద్ర ప్రభుత్వం నిత్యవసరాల ధరలు పెంచి సామాన్యులపై భారం మోపుతోందని విమర్శించారు. పెంచిన ధరలు తగ్గించే వరకు పోరాడుతామని పిలుపునిచ్చారు.