అడ్డు తొలగించుకోవాలని భర్తపై భార్య హత్యయత్నం

అడ్డు తొలగించుకోవాలని భర్తపై భార్య హత్యయత్నం

HYD: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను హతమార్చాలనుకుంది ఓ భార్య. పోచారం PS పరిధిలో బొట్టు రమేష్ భార్య బాలమణికి బంధువు అమర్‌తో వివాహేతర సంబంధం ఉంది. విషయం తెలిసి రమేష్ భార్యను హెచ్చరించాడు. దీంతో అతడి అడ్డు తొలగించుకోవాలని ఈ నెల 7న ప్రియుడుతో కలిసి కర్రలతో దాడి చేసింది. తమ జోలికి రావొద్దని వార్నింగ్ ఇచ్చి వదిలేసింది. భర్త ఫిర్యాదుతో బాలమణిని అరెస్ట్ చేశారు.