ట్రావెల్స్ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

ప్రకాశం: ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని కనుమల్ల సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. మృతుడు టంగుటూరు మండలం వెలగపూడి గ్రామానికి చెందిన గుంతటి సింగయ్యగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై నాగమల్లేశ్వరరావు తెలిపారు.