కృష్ణమ్మ చెంతనే దాహం.. తాగునీటికి తంటాలు.!
NTR: పెనమలూరు, తాడిగడప మున్సిపాలిటీ కృష్ణా నది పక్కనే ఉన్నా ఈ ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. భూగర్భ జలాల్లో TDS 800-1200 ఉండటంతో అవి తాగేందుకు పనికిరావడం లేదు. దీంతో వీధుల్లో నాణ్యత లేని వాటర్ ప్లాంట్లు పుట్టగొడుగుల్లా వచ్చాయి. ఇటీవల మంజూరైన అమృత్ 2.0 నిధులు రూ.30 కోట్లతోనైనా 2 లక్షల జనాభాకు కృష్ణా నది జలాలను అందించాలని ప్రజలు కోరుతున్నారు.