కనిగిరిలో ప్రత్యేక వైద్య శిబిరం
ప్రకాశం: కనిగిరిలో కార్తీక పౌర్ణమి సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలోని కొండపై కొలువైన శ్రీ విజయ మార్తాండేశ్వర, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాల సముదాయంలో ప్రభుత్వ వైద్యులు, డాక్టర్ శైలజ నేతృత్వంలో భక్తులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను పంపిణీ చేశారు.