నేడే జాబ్ మేళా

నేడే జాబ్ మేళా

WGL: ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని నిరుద్యోగుల కోసం మంగళవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధిశాఖ అధికారి రజిత తెలిపారు. పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు ఇవాళ ఉదయం 11 గంటలకు విద్యార్హత ధ్రువ పత్రాలతో ములుగు రోడ్డులోని జిల్లా ఉపాధిశాఖ కార్యాలయంలో హాజరుకావాలన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.