'ఫీల్డ్ అసిస్టెంట్లు లేక ఆగిన ఉపాధి పనులు"
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫీల్డ్ అసిస్టెంట్ల కొరతతో ఉపాధి హామీ పనులకు ఆటంకం కలుగుతోంది. 1,751 పంచాయతీలకు గాను కేవలం 1,202 మంది మాత్రమే విధుల్లో ఉండటంతో సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో పర్యవేక్షణ కరవైంది. దీనివల్ల వేతనాల చెల్లింపులో జాప్యం జరుగుతోందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.