'ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం'

తూ.గో: మండల కేంద్రమైన గోకవరం గ్రామంలో స్థానిక డ్రైవర్స్ కాలనీ నందు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎన్డీయే కూటమి నాయకుల ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బందిచే వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం ఎన్డీయే ప్రభుత్వం పెన్షన్ అందజేసిందనీ హర్షం వ్యక్తం చేశారు.