మాల మహానాడు ఆధ్వర్యంలో సీఎంకు వినతిపత్రం అందజేత

మాల మహానాడు ఆధ్వర్యంలో సీఎంకు వినతిపత్రం అందజేత

NZB: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎస్సీ వర్గీకరణ బిల్లుపై పునరాలోచించుకోవాలని మాల మహానాడు ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. సోమవారం జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు. 2014 జనాభా లెక్కల ప్రకారం ఎంపిరికల్ డేటా తీసుకొని మాలలకు ఆరు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆనంపల్లి ఎల్లయ్య, ఎడ్ల నాగరాజు ఉన్నారు.