VIDEO: జూలో ‘నల్ల చిరుత’ సందడి
విశాఖపట్నంలోని ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్‌లో కొత్తగా చేరిన నల్ల చిరుత సందర్శకులను ఆకట్టుకుంటోంది. అస్సాం నుంచి తీసుకువచ్చిన ఈ బ్లాక్ పాంథర్‌ను క్వారెంటైన్ అనంతరం ఎన్‌క్లోజర్‌లో ఉంచారు. అటవీ శాఖ అధికారులు విడుదల చేయగా, జూకి వచ్చిన సందర్శకుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.