గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

ADB: భైంసాలోని సాత్ పూల్ బ్రిడ్జి వద్ద గల స్మశాన వాటిక సమీపంలోని సుద్ద వాగులో ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు భైంసా టౌన్ సీఐ రాజారెడ్డి తెలిపారు. మృతి చెందిన వ్యక్తి వయస్సు 25 - 35 సం.లు ఉంటుందని తెలిపారు. కుడిచేతిపై హిందీలో లక్ష్మణ్ అని రాసి ఉందన్నారు. ఎవరైనా ఆచూకి తెలిసిన వారుంటే భైంసా టౌన్ పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు.