హాట్ టాపిక్‌గా మారిన ప్రభాస్ రెమ్యూనరేషన్!
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'రాజాసాబ్', 'ఫౌజీ', 'స్పిరిట్' మూవీలతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ప్రభాస్ రెమ్యూనరేషన్‌పై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. 'స్పిరిట్' మూవీ కోసం ఆయన రూ.160 కోట్లకుపైగా పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. దీంతో ప్రభాస్ టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోగా నిలిచినట్లు సినీ వర్గాలు తెలిపాయి.