అసెంబ్లీ స్పీకర్‌కు బాంబు బెదిరింపులు
ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ విజయేందర్ గుప్తాకు ఉదయం 7:28 గంటలకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ రావడం తీవ్ర కలకలం రేపింది. ఉదయం 7:49 గంటలకు మరో మెయిల్ వచ్చింది. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు వచ్చిన ఈ బెదిరింపులు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఇతర అగ్రనేతలను కూడా లక్ష్యంగా చేసుకున్నాయి. భద్రతా బలగాలు, బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు ముమ్మరం చేశాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.