నంద్యాల కలెక్టర్ కార్యాలయం ముందు ఏఐటీయూసీ ధర్నా
NDL: నంద్యాల పట్టణంలో ఇవాళ కొత్త బస్టాండ్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ఏఐటీయూసీ నాయకులు ఇతర కార్మిక సంఘాల నాయకులతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి వ్యతిరేకంగా ఏఐటీయూసీ నాయకులు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.