కళాశాల విద్యార్థులకు కంప్యూటర్, యూనిఫామ్స్ వితరణ

కళాశాల విద్యార్థులకు కంప్యూటర్, యూనిఫామ్స్  వితరణ

SRCL: చందుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మండల కేంద్రం చెందిన దారం రేణుక - సతీష్ దంపతులు కంప్యూటర్ ప్రింటర్, విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్స్ అందజేశారు. ఈ సందర్భంగా దాతలు రేణుక-సతీష్‌లను కళాశాల ప్రిన్సిపల్ ఎం. విజయలక్ష్మి, విద్యార్థులు శాలువతో ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు చేసిన నృత్యాలు అలరించాయి.