కామారెడ్డి డీఎస్పిగా మధుసూదన్
కామారెడ్డి డీఎస్పీగా ఎస్. మసుదన్ బదిలీ అయ్యారు. నిజామాబాద్ జిల్లా ఇంటిలిజెన్స్ డీఎస్పీగా పనిచేస్తున్న మధుసూదన్‌ను కామారెడ్డికి అధికారులు బదిలీ చేశారు. గత కొన్ని రోజుల క్రితం కామారెడ్డిలో పనిచేసిన చైతన్య రెడ్డి బదిలీపై సంగారెడ్డికి వెళ్లిన విషయం తెలిసిందే. మధుసూదన్ మూడు సంవత్సరాల క్రితం కామారెడ్డిలో సీఐగా పనిచేసి తిరిగి ఇక్కడికే డీఎస్పిగా వచ్చారు.