పార్కులో భారీ అగ్నిప్రమాదం
SDPT: గజ్వేల్ అర్బన్ పార్కులో మంగళవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పార్కులోని ఖాళీ స్థలంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం.