వయసు 15 ఏళ్లు.. సెంచరీతో వరల్డ్ రికార్డు
అంతర్జాతీయ మహిళల టీ20లో రువాండా బ్యాటర్ ఫ్యానీ సరికొత్త ఘనత సాధించింది. ఘనాపై జరిగిన మ్యాచ్‌లో 111 పరుగులతో అదరగొట్టింది. ఈ క్రమంలో అంతర్జాతీయ టీ20ల్లో అతి చిన్న వయసు(15)లోనే శతకం బాదిన క్రికెటర్‌గా రికార్డ్ సృష్టించింది. దీంతో ఉగాండా ప్లేయర్ ప్రొస్కోనియా అలకో(16 ఏళ్ల 233 రోజులు: 2019లో మాలి జట్టుపై) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది.