కోడిపందేలు ఆడుతున్న వారిపై కేసు నమోదు

కోడిపందేలు ఆడుతున్న వారిపై కేసు నమోదు

VZM: కొత్తవలస పోలీసు స్టేషన్ పరిధిలోని చిన్నిపాలెం గ్రామంలో కోడిపందేలు ఆడుతున్న సమాచారం మేరకు గురువారం సిబ్బందితో దాడులు చేపట్టగా ఐదుగురు వ్యక్తులు పట్టుబడినట్లు సీఐ సిహెచ్. షణ్ముఖరావు తెలిపారు. వారి నుంచి రూ 1,23,280 నగదు, ఐదు చరవాణులు, రెండు కోడిపుంజులు స్వాధీనం చేసుకొని, వారిపై కేసు నమోదు చేశామని సీఐ చెప్పారు. తనిఖీల్లో సిబ్బంది పాల్గొన్నారు.