ఎమ్మెల్యే ఉగ్రను కలిసిన పామూరు సీఐ
ప్రకాశం: పామూరు సర్కిల్ నూతన సీఐగా మాకినేని శ్రీనివాసరావు శనివారం బాధ్యతలు చేపట్టారు. ఆదివారం కనిగిరిలోని ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి నివాసంలో ఎమ్మెల్యేను మర్యాదపూర్వం కలిసి పుష్పగుచ్చనిచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే ఉగ్ర మాట్లాడుతూ.. ప్రధానంగా పామూరు పట్టణంలో ట్రాఫిక్ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.