ఆదర్శ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్
అన్నమయ్య: రామాపురం మండలంలోని AP ఆదర్శ పాఠశాలను శుక్రవారం కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆకస్మికంగా చేశారు. విద్యార్థుల ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యాన్ని పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. తరగతి గదులలో విద్యార్థులు రాసుకున్న నోటు పుస్తకాలను పరిశీలించి, వాటిని ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని సూచించారు.