మహిళల భద్రతకు పోలీసుల అగ్ర ప్రాధాన్యం

మహిళల భద్రతకు పోలీసుల అగ్ర ప్రాధాన్యం

అన్నమయ్య: జిల్లాలో మహిళల భద్రతకు పోలీస్ శాఖ అగ్ర ప్రాధాన్యం ఇస్తోందని రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజంపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో శక్తి యాప్, సైబర్ భద్రత, అత్యవసర హెల్ప్‌లైన్‌లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు 112, 1091, 181, 1930 వంటి హెల్ప్‌లైన్‌లను ఉపయోగించుకోవాలని సూచించారు.