'పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి'

'పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి'

ప్రకాశం: కార్మికులకు కనీస వేతన చట్టం అమలు చేయాలని జిల్లా సీఐటీయూ నాయకులు రాయల మాలకొండయ్య ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు. శనివారం వెలిగండ్లలో సీఐటీయూ నాయకుల సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ కార్మికులకు, వెలుగు వ్యానిమేటర్స్‌కు, పాఠశాల ఆయాలకి మధ్యాహ్నం భోజన కార్మికులకు పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.