VIDEO: శ్రీశైలంలో పెరిగిన భక్తుల రద్దీ
NDL: శ్రీశైలంలో సోమవారం భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. స్వామి, అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లలో భక్తులు సుమారు 3 గంటలు వేచి ఉండాల్సి వస్తోంది. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు వసతులను పర్యవేక్షిస్తున్నారు. శని, ఆది, సోమవారాల్లో ఆర్జిత సేవలు తాత్కాలికంగా నిలిపివేశారు. ఆన్‌లైన్ వీఐపీ టికెట్లు ఉన్నవారిని విడతల వారీగా దర్శనానికి అనుమతిస్తున్నారు.