అన్నం ఇరుక్కుని వృద్ధురాలు మృతి

అన్నం ఇరుక్కుని వృద్ధురాలు మృతి

GDWL: గొంతులో అన్నం ఇరుక్కొని ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన మల్దకల్ మండలం అమరవాయిలో జరిగింది. స్థానికులు వివరాలు.. అమరవాయికి చెందిన శాంతమ్మ(75) రోజు ఇంటి పనులు చేస్తూ ఉండేది. శుక్రవారం హోలీ ఉండటంతో ఇంటి వద్ద భోజనం చేస్తుండగా అన్నం ముద్ద గొంతులో ఇరుక్కుని అస్వస్థతకు గురైంది. గద్వాల ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.