VIDEO: కల్తీ ఫుడ్‌కు అడ్డాగా మారిన ఉయ్యూరు
కృష్ణా: ఉయ్యూరులో పుట్టగొడుగుల్లా పెరిగిపోతున్న ఆహార విక్రయ కేంద్రాల వల్ల ప్రజల ఆరోగ్యం తీవ్ర ప్రమాదంలో పడుతోంది.హోం ఫుడ్స్ పేరుతో నయా దందా చేస్తున్న అనేక ఆహార తయారీ కేంద్రాలు అధికారుల పర్యవేక్షణ లేకుండా విచ్ఛలవిడిగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఈ కల్తీ వ్యాపారం వల్ల ఆరోగ్యం పాడవుతుందని ప్రజలు వాపోతున్నారు. కల్తీ ఫుడ్‌పై చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.