ముగ్గురు పేకాటరాయుళ్లు అరెస్ట్
KDP: తొండూరు మండలంలో సోమవారం ముగ్గురు పేకాట రాయుళ్లను అరెస్టు చేసినట్లు ఎస్సై ఘన మద్దిలేటి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొండూరు మండలం మల్లేల గ్రామంలోని చీనీ తోటలో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతుండగా పోలీసులు దాడులు చేశారన్నారు. ఈ దాడులలో ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.3200లు, పేకాట ముక్కలు స్వాధీనం చేసుకున్నామన్నారు.