నా దృష్టిలో వాటికి పెద్ద తేడా లేదు: ఐశ్వర్యారాయ్

సోషల్ మీడియా వినియోగంపై బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన దృష్టిలో సోషల్ మీడియాకు, సామాజిక ఒత్తిడికి మధ్య పెద్ద తేడా లేదన్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ దీనికి బానిసలు అవుతున్నారని, దాని నుంచి బయటపడితే అసలైన ప్రపంచం కనిపిస్తుందని తెలిపారు. సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం సోషల్ మీడియాల్లో వెతకడం వృధా అని, కచ్చితంగా అక్కడ అది దొరకదని వెల్లడించారు.