VIDEO: పంట వ్యర్థాల దహనం.. పర్యావరణానికి పొంచి ఉన్న ముప్పు!
SGR: జిల్లాలో సాగు తర్వాత మిగిలిన పంట కాండాలు, వరిగడ్డిని రైతులు పొలాల్లోనే తగలబెడుతున్నారు. దీనివల్ల వాతావరణ కాలుష్యం పెరగడమే కాకుండా, భూమిలోని మిత్ర పురుగులు, సూక్ష్మజీవులు నశిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఢిల్లీ తరహా కాలుష్య పరిస్థితులు రాకముందే అధికారులు స్పందించి రైతులకు అవగాహన కల్పించాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.