శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు
గాయం తర్వాత మళ్ళీ ఫామ్ లోకి రావడం చాలా కష్టమైందని టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు. కోలుకునే క్రమంలో తాను 7 కిలోల బరువు తగ్గానని, మళ్ళీ మునుపటి స్థితికి రావడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చిందని తెలిపాడు. ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాని చెప్పాడు. పంజాబ్ కింగ్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నందుకు సంతోషంగా ఉందని వెల్లడించాడు.