'కార్పొరేషన్ పరిధిలో త్రాగునీటికి ఇబ్బంది ఉండకూడదు'

'కార్పొరేషన్ పరిధిలో త్రాగునీటికి ఇబ్బంది ఉండకూడదు'

MBNR: కార్పొరేషన్ పరిధిలో త్రాగునీటికి ఇబ్బంది ఉండకూడదని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. నిన్న జిల్లా కలెక్టరేట్‌లో మున్సిపల్ అధికారులతో ఆమె సమావేశం అయ్యారు. త్రాగునీటి సరఫరా పైప్‌లైన్లు పగిలితే వాటి స్థానంలో వెంటనే కొత్త వాటిని ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలు నీటికోసం అవస్థ పడకూడదన్నారు. అలాగే, ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు త్వరగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.