'ఎన్నికల ఏర్పాట్లలో లోపాలు లేకుండా చూడాలి'
PDPL: పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. జిల్లా పంచాయతీ కార్యాలయంలో పోలింగ్ కేంద్రాల ర్యాండమైజెషను పరిశీలించిన ఆయన, సిబ్బంది కేటాయింపు నిబంధనల ప్రకారం ఉండాలని తెలిపారు. నామినేషన్లు టి-యాప్‌లో నమోదు చేయాలని, అవసరమైన సామాగ్రి సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. పోస్టల్ బ్యాలెట్లు, బ్యాలెట్‌లు అందించాలన్నారు.