జీవితంపై విరక్తి చెంది యువకుడు ఆత్మహత్య
AKP: అచ్యుతాపురం మండలానికి చెందిన ఓ యువకుడు జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. నాగేశ్వరరావు అనే యువకుడు సొంత గ్రామంలో ఇల్లు కట్టుకుని వివాహం చేసుకోవాలనుకున్నాడు. ఇంటి నిర్మాణం కోసం డబ్బులు సరిపోకపోవడంతో అప్పులు చేశాడు. అప్పులు తీర్చాలని ఒత్తిడి రావడంతో బయటకు వెళ్ళి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విశాఖలో చికిత్స పొందుతూ నిన్న మృతిచెందాడు.