పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

JGL: కథలాపూర్ మండలంలో జిల్లా కలెక్టర్ బీ.సత్యప్రసాద్ ఆకస్మికంగా మంగళవారం పర్యటించారు. ఈ మేరకు కథలాపూర్ మండలంలోని భూషన్ రావుపేట గ్రామ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. పాఠశాలలోని విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలని ఉపాధ్యాయులకు కలెక్టర్ సూచించారు.