గట్టుప్పల్‌లో రేపు ఉచిత కంటి వైద్య శిబిరం

NLG: గట్టుప్పల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జగన్నాథం తెలిపారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. శిబిరం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, మండల ప్రజలు పాల్గొని వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.