ఇన్స్‌స్టా యాడ్.. రూ.35 వేలు స్వాహా
NZB :ఇన్‌స్టాగ్రామ్‌లో ఆకర్షణీయమైన ప్రకటన చూసి ఓ యువతి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంది. జానకంపేట్ మండలానికి చెందిన ఓ యువతి ఈనెల 2న ఒక డ్రెస్ ఆర్డర్ చేసింది. ఆర్డర్ కన్ఫర్మ్ కోసం రూ.1,019 చెల్లించగా, ఆ తర్వాత ఆమె ఖాతా నుంచి విడుతల వారీగా మొత్తం రూ.35,159 డెబిట్ అయ్యాయి. అది నకిలీ వెబ్‌సైట్ అని గుర్తించిన బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.