'పెన్షన్ దారుల సభను జయప్రదం చేయండి'

'పెన్షన్ దారుల సభను జయప్రదం చేయండి'

KMM: మధిర పట్టణంలో ఈ నెల 8న నిర్వహించే అన్ని పెన్షన్ దారుల సభను జయప్రదం చేయాలని MRPS మధిర నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ప్రభాకర్ మాదిగ అన్నారు. బుధవారం మధిరలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల పెన్షన్‌లను వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు. ఆ సభకు అన్ని రకాల పెన్షన్ దారులు తరలిరావాలన్నారు.