'గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి'

MBNR: బాలానగర్ మండలంలో రాబోయే గణేష్ ఉత్సవాల సందర్భంగా శాంతి భద్రతలను కాపాడేందుకు ఎస్సై లెనిన్ ఆధ్వర్యంలో పోలీసు స్టేషన్‌లో శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉత్సవ నిర్వాహకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల ప్రజలు, నిర్వాహకులు ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని, ఎటువంటి అల్లర్లకు పాల్పడవద్దని సూచించారు.