ఉగ్రవాద దాడి మృతులకు న్యాయవాదులు నివాళి

ఉగ్రవాద దాడి మృతులకు న్యాయవాదులు నివాళి

NDL: ఉగ్రవాద దాడిలో మరణించిన వారికి నంద్యాల జిల్లా న్యాయవాదులు నివాళులు అర్పించారు. న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు హుస్సేన్ భాషా ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అమాయక పౌరులను మతం పేరుతో పొట్టను పెట్టుకోవడం హేయమైన చర్య అని తెలిపారు. ఇది క్షమించరాని నేరమని దీనికి తప్పకుండా మూల్యం చెల్లించుకోవాలని తెలిపారు.