మెస్సీ- రేవంత్ ఫ్రెండ్లీ మ్యాచ్.. 27,000 టికెట్లు బుక్
TG: ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ ఇవాళ HYDకి రానున్నారు. ఈ సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో మెస్సీ- సీఎం రేవంత్ జట్ల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత అభిమానులతో ఫొటో సెషన్ కూడా ఉండనుంది. మెస్సీతో ఫొటో కోసం రూ.10 లక్షల ఫీజు విధించగా, ఇప్పటికే 60 మంది రిజిస్టర్ చేసుకున్నారు. కాగా ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ కోసం 27,000 టికెట్లు ఇప్పటికే బుక్ అయ్యాయి.