మన్యంకొండలో ఘనంగా స్వాముల ఆరాధన

మన్యంకొండలో ఘనంగా స్వాముల ఆరాధన

MBNR: మన్యంకొండ శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీమన్ రామదూత లక్ష్మీ నరసింహ యోగానంద స్వాముల ఆరాధన మహోత్సవం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా హనుమద్దాసు మండపంలో స్వామివారి పాదాలను ప్రతిష్ఠించి, శాస్త్రోక్తంగా అభిషేకాలు, ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. ఈ వేడుకలో ఆలయ ధర్మకర్త అలహరి మధుసూదన్ కుమార్, ఈవో శ్రీనివాస రాజు పాల్గొన్నారు.