పేరుకుపోయిన చెత్తతో అవస్థలు

పేరుకుపోయిన చెత్తతో అవస్థలు

గుంటూరు కంకర కుంట ఫ్లైఓవర్ కింద భాగం అండర్‌పాస్‌గా ఉండాల్సిన చోట చెత్త పేరుకుపోవడం, సైకిళ్లు, బైకులు అడ్డంగా పార్క్ చేయడం వల్ల డంపింగ్ యార్డ్‌లా మారింది. రద్దీగా ఉండే ఈ ప్రదేశంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతుండటంతో పాటు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే శుభ్రపరిచి ట్రాఫిక్ సదుపాయం కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.