VIDEO: ప్రభుత్వ ఆసుపత్రిలో స్కానింగ్ సేవలు పునః ప్రారంభం
SRCL: జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గత మూడు రోజులుగా కాంట్రాక్టు ముగియడంతో స్కానింగ్ సేవలు నిలిచిపోయాయి. గర్భిణీ స్త్రీలు, రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ స్పందించి తక్షణ చర్యలు తీసుకొని ఇవాళ పునః ప్రారంభించారు. ఈ మేరకు తాత్కాలికంగా రేడియాలజీ డాక్టర్లను నియామకం చేశామని తెలిపారు.